హోమ్Neurologyబ్రెయిన్ ఫాగ్ గురించి మీరు తెలుసుకోవాల్సినది

బ్రెయిన్ ఫాగ్ గురించి మీరు తెలుసుకోవాల్సినది

మీరు ఎప్పుడైనా ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడంలో ఇబ్బంది పడే లేదా మసకగా ఆలోచించే పరిస్థితిని ఎదుర్కొన్నారా? అలా అయితే, మీరు బ్రెయిన్ ఫాగ్‌తో బాధపడుతూ ఉండవచ్చు

బ్రెయిన్ ఫాగ్ అనేది వైద్యపరమైన పరిస్థితి కాదు కానీ ఒక వ్యక్తి ఆలోచనలో ఇబ్బందిని ఎదుర్కొనే, ఒకే ఆలోచనపై దృష్టి కేంద్రీకరించలేకపోయే, వారి ఆలోచనల నుండి సరైన వాక్యాన్ని సృష్టించలేకపోయే మరియు సూటిగా ఆలోచించలేకపోయే కొన్ని లక్షణాల సమూహం. ఈ లక్షణాలు వైద్య పరిస్థితి కారణంగా లేదా అధిక ఒత్తిడితో కూడిన పేలవమైన జీవనశైలి నుండి ఉత్పన్నమవుతాయి.

బ్రెయిన్ ఫాగ్ అంటే ఏమిటి?

బ్రెయిన్ ఫాగ్ అనేది వైద్య పరిస్థితి కాదు, ఒక వ్యక్తి పదునైన జ్ఞాపకశక్తిని కలిగి ఉండలేని లేదా ఏకాగ్రత లోపం వంటి అభిజ్ఞాన సంబంధ వైఫల్యతల లక్షణాల సమూహం. బ్రెయిన్ ఫాగ్ ఉన్న వ్యక్తి ఆలోచనను ముందుకు తీసుకెళ్ళడం, దేన్నైనా గుర్తుకు తెచ్చుకోవడంలో, ఏకాగ్రత లేదా శ్రద్ధ వహించడంలో ఇబ్బంది కలిగి ఉండటం, మానసిక అలసట పొందటం వంటి సమస్యలను కలిగి ఉంటారు.

తీవ్రమైనది కానప్పటికీ చాలా సాధారణమైన, బ్రెయిన్ ఫాగ్ ఒక వ్యక్తి యొక్క మేధస్సును క్షీణింపజేయదు, లేదా అది నానాటికీ ముదరడం లేదా పురోగమించడం జరగదు, కానీ ఒక వ్యక్తి సాధారణ పని చేయడంలో ఇబ్బంది పడవచ్చు మరియు నిరాశ మరియు ఆత్మగౌరవ న్యూనతతో బాధపడవచ్చు ( తనలా తాను ఉండలేకపోతున్నాననే భావన).

కొందరు తమ ఆలోచనలను ఉపయోగించి వాక్యాలను రూపొందించడంలో ఇబ్బందులను ఎదుర్కొనే మాట్లాడే మరియు భాషా రుగ్మతలతో కూడా బాధపడవచ్చు.

బ్రెయిన్ ఫాగ్ లక్షణాలు ఏమిటి?

బ్రెయిన్ ఫాగ్ ప్రజలలో భిన్నంగా పనిచేస్తుంది.  ఇది పాఠశాలకు వెళ్లే పిల్లల నుండి పూర్తి ఎదిగిన పెద్దవారి వరకు మరియు వృద్ధాప్యంలో కూడా అన్ని వయస్సుల వారిని ప్రభావితం చేయగలదు. మెదడు పొగమంచుతో బాధపడుతున్న వ్యక్తికి ఒక లక్షణం ఉండవచ్చు లేదా పరిస్థితుల తీవ్రతతో సంబంధం ఉన్న అనేక లక్షణాలు మేళవింపుగా ఉండవచ్చు. కొన్ని బ్రెయిన్ ఫాగ్ సాధారణ లక్షణాలు క్రింద పేర్కొనబడ్డాయి.

·         ఏకాగ్రత తగ్గడం

·         జ్ఞాపక శక్తిని కోల్పోవడం

·         అస్పష్టమైన, చెదురు మదురు ఆలోచనలు

·         తీవ్రమైన అలసట మరియు నిద్ర పోవాలనే భావనను కలిగి ఉండటం

·         నిరుత్సాహంగా ఉండటం

·         ఆత్మ గౌరవ పాళ్ళు తక్కువగా ఉండటం

·         పాఠశాల మరియు పని ప్రదేశం వద్ద పేలవ ప్రదర్శనను కనబర్చలేకపోవడం

·         కృంగిన స్థితిలో ఉండటం

·         పదాలనుపయోగించి ఒక వాక్యాన్ని నిర్మించలేకపోవడం లేదా సులభమైన వాక్యాన్ని కూడా అర్థం చేసుకోలేకపోవడం

·         ఒకే లక్ష్యంపై ఏకగ్రతను ఉంచలేకపోవడం

·         ప్రణాళికలను అమలు చేయలేకపోవడం, సమస్యను పరిష్కరించడం, లేదా అన్నింటినీ ఒక క్రమంలో అమర్చడం

బ్రెయిన్ ఫాగ్‌కు కారణాలు ఏమిటి?

పరిశోధన ప్రకారం, బ్రెయిన్ ఫాగ్‌కు వివిధ కారణాలు మరియు పరిస్థితులు కారణమవుతాయి. కారణాన్ని గుర్తించి అంతర్లీన కారణానికి ప్రారంభ చికిత్స ప్రారంభించడం అవసరం. బ్రెయిన్ ఫాగ్‌కు కారణమయ్యే కొన్ని కారణాలు క్రింద పేర్కొనబడ్డాయి:

తీవ్రమైన ఒత్తిడి

అధిక ఒత్తిడి బ్రెయిన్ ఫాగ్‌కు కారణం కాగలదని విశ్వసించబడింది. దీర్ఘకాలిక ఒత్తిడి మెదడుపై అధిక పనిభారాన్ని మరియు పీడనాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి వల్ల రక్తపోటు పెరగడం, మానసిక అలసట, దృష్టి కేంద్రీకరించలేకపోవడం, తీవ్రమైన తలనొప్పి, కృంగుబాటుకు లోనుకావడం కూడా జరుగవచ్చు.  ఇది మీ మెదడు సరిగా పనిచేయక, ఏకాగ్రతను కోల్పోయేలా చేస్తుంది.

విటమిన్ B12 లోపం

విటమిన్ B12 లోపం బ్రెయిన్ ఫాగ్‌కు దారితీస్తుంది. విటమిన్ B12 మొక్కల నుండి వచ్చే ఉత్పత్తులలో కాకుండా ప్రత్యేకంగా పాలు, చేపలు, గుడ్డు మొదలైన వాటిలో లభిస్తుంది. విటమిన్ B12 మెదడు పనితీరును మెరుగుపడేలా చేస్తుంది.  B12 లోపం రక్తహీనతకు దారితీస్తుంది (రక్తంలో తక్కువ హిమోగ్లోబిన్ స్థాయిలు), ఇది అలసట , జ్ఞాపకశక్తి బలహీనత, చేతులు మరియు కాళ్ళపై జలదరింపు అనుభూతులను కలిగిస్తుంది.

దీర్ఘకాలిక లోపం కోలుకోలేని స్థితికి దారి తీస్తుంది.  విటమిన్ B12 లోపం తగినంత ఆహారం తీసుకోకపోవడం, శోషణ తగ్గడం, వైద్య పరిస్థితులు మొదలైన వాటి వల్ల తలెత్తవచ్చు.

తగ్గిన నిద్ర

నిద్ర గంటలు తగ్గడం మరియు కలత నిద్ర విధానాలు మెదడు పనితీరు బలహీనపడటానికి దారి తీయవచ్చు. ఆరోగ్యకరమైన మెదడు పనితీరుకు 8 నుండి 9 గంటల పాటు తగినంత నిద్ర అవసరం. నిద్ర తగ్గడం వల్ల మానసిక అలసట, ఏకాగ్రత కోల్పోవడం కూడా సంభవించవచ్చు.

హార్మోన్ల అసమతుల్యత మరియు మార్పు

శరీరంలోని హార్మోన్ల నియంత్రణలో అసమతుల్యత బ్రెయిన్ ఫాగ్‌కు దారితీస్తుంది. గర్భధారణ సమయంలో , ఈస్ట్రోజెన్ మరియు ప్రొజెస్టెరాన్ స్థాయిలు పెరుగుతాయి. ఈ హార్మోన్ల స్థాయిలు పెరగడం వల్ల అభిజ్ఞా పనితీరు మరియు జ్ఞాపకశక్తి దెబ్బతింటుంది.

అలాగే, రుతువిరతి సమయంలో , ఈస్ట్రోజెన్ స్థాయి తగ్గడం మెదడు పనితీరును ప్రభావితం చేయడంతో పాటు, ఇది ఇటీవలి జ్ఞాపకశక్తిని బలహీనపరుస్తుంది మరియు అస్పష్టమైన స్పృహను కలిగి ఉండటానికి దారి తీస్తుంది. థైరాయిడ్ హార్మోన్లు T3, T4 మరియు TSH యొక్క అసమతుల్యత మెదడు పనితీరులో తగ్గుదల మరియు మతిమరుపుకు దారితీస్తుంది.

డ్రగ్స్ (ఔషధాలు)

మందులు తీసుకోవడం వల్ల బ్రెయిన్ ఫాగ్ ఏర్పడుతుందనే భావన ఉంది. యాంటికోలినెర్జిక్ డ్రగ్స్ వంటి మందులు నాడీ వ్యవస్థలోని న్యూరోట్రాన్స్మిటర్లను నిరోధించడానికి వీలు కలిగిస్తాయి, ఇది మెదడు పనితీరును తగ్గిస్తుంది. బ్రెయిన్ ఫాగ్‌కు కారణమయ్యే యాంటీకోలినెర్జిక్ మందులు ఆక్సిబుటినిన్ , డైఫెన్‌హైడ్రామైన్ , అమిట్రిప్టిలైన్ , మొదలైనవి. కీమోథెరపీ చేయించుకుంటున్న రోగి బ్రెయిన్ ఫాగ్‌తో బాధపడవచ్చు, ఎందుకంటే కీమోథెరపీ మందులు రోగనిరోధక శక్తిని అణిచివేసి మెదడు పనితీరును దెబ్బతీస్తాయి.

బ్రెయిన్ ఫాగ్‌తో సంబంధం ఉన్న ఇతర వైద్య పరిస్థితులు:

·         చింత

·         వ్యాకులత

·         మధుమేహం

·         స్జోర్గెన్ సిండ్రోమ్

·         ల్యూపస్

·         మల్టిపుల్ స్క్లెరోసిస్

·         అల్జీమర్స్ వ్యాధి

·         తీవ్రమైన డీహైడ్రేషన్

·         మైగ్రేన్ తలనొప్పు, మొదలైనవి

డాక్టర్‌ని ఎప్పుడు కలవాలి?

మరియు పాఠశాల/పనిలో ఏకాగ్రత చూపలేనప్పుడు లేదా బాగా పని చేయలేనప్పుడు మీ వైద్యుడిని సందర్శించడం మంచిది. అధిక ఒత్తిడిని మీ మీదకు తీసుకొని అనవసరంగా మీ మెదడుపై భారం పడనీయకుండా చూడటానికి మీ ఆలోచనలు మరియు సమస్యలను మీకు సన్నిహితంగా ఉండే వ్యక్తులతో పంచుకోవాలని మేము ఎల్లప్పుడూ సిఫార్సు చేస్తున్నాము.

ఆసుపత్రిలో ఒకే పరీక్ష ద్వారా బ్రెయిన్ ఫాగ్‌ను నిర్ధారించడం సాధ్యపడదు కాబట్టి, మీ వైద్యుడు మీకు వివిధ పరీక్షలను నిర్వహించి, మీ లక్షణాలను మెరుగుపరచడానికి ప్రవర్తనా చికిత్సతో పాటుగా మందులను అందిస్తారు, దీనికి ప్రారంభంలో కొంత సమయం పట్టవచ్చు. మీ డాక్టర్, మీ పరిస్థితికి మూల కారణమమని తనకు అనిపించే ఆహారం, మానసిక స్థితి, వైద్య పరిస్థితులు, ఔషధ చరిత్ర వంటి వాటిని మీ నుండి దూరం చేస్తారు.

పలు రకాల వ్యాధులు కొన్ని ఉమ్మడి లక్షణాలను కలిగి ఉంటాయి. మీకున్న ఏదైనా వైద్య లేదా శస్త్రచికిత్స చరిత్ర గురించి మీ డాక్టర్‌కు చెప్పండి. మీరు ఇటీవల తీసుకున్న ఏదైనా మందుల ప్రిస్క్రిప్షన్‌ను వారికి చూపించండి. CT, MRI, TFT, బ్లడ్ పిక్చర్ (ఇన్ఫెక్షన్, బ్లడ్ షుగర్, రక్తహీనత వంటి వాటిని అదుపులోనికి తెవడానికి) వంటి పరీక్షలు బ్రెయిన్ ఫాగ్‌కు అసలు కారణాన్ని గుర్తించడంలో మీ వైద్యుడికి సహాయపడతాయి. మీ వైద్యుడు అలర్జీలను తగ్గించడానికి కొన్ని యాంటిజెన్-యాంటీబాడీ పరీక్షలను నిర్వహించవచ్చు మరియు నిద్ర రుగ్మతలను తగ్గించడానికి మీ నిద్ర విధానాన్ని పర్యవేక్షించవచ్చు.

అపాయింట్మెంట్ బుక్ చేయడానికి 1860-500-1066 కు కాల్ చేయండి.

బ్రెయిన్ ఫాగ్‌కు చికిత్స ఏమిటి?

ముందుగా మూల కారణ పరిస్థితులకు చికిత్స చేయడం చాలా అవసరం కాబట్టి బ్రెయిన్‌ ఫాగ్‌ను చికిత్స చేయడానికి సమయం మరియు కృషి అవసరం అవుతుంది. బ్రెయిన్ ఫాగ్‌కు చికిత్స చేయడానికి మరియు మెదడు పనితీరును మెరుగుపరచడానికి మీరు తెలుసుకోవలసిన కొన్ని విషయాలు ఇక్కడ ఉన్నాయి:

తగినంత నిద్ర

నిద్ర లేమి మీ మెదడు పనితీరును దెబ్బతీస్తుంది కాబట్టి మీ నిద్ర సరళిని మెరుగుపరచండి. కనీసం 8 నుండి 9 గంటల పాటు సకాలంలో నిద్రపోయే షెడ్యూల్‌ని రూపొందించుకోండి. క్రమమైన నిద్ర విధానం ఆరోగ్యకరమైన మెదడు పనితీరు మరియు పదునైన జ్ఞాపకశక్తికి సహాయపడుతుంది. ఆలస్యంగా, క్రమ రహితంగా నిద్రపోవడం వల్ల ఏకాగ్రత తగ్గుతుంది మరియు మానసిక అలసటకు లోనవుతారు.

మీ మెదడులోని భారాన్ని తగ్గించుకోండి

ఒత్తిడిని వీలైనంత వరకు తగ్గించుకోండి. మీ మెదడుపై ఎక్కువ భారం పడి, ఏకాగ్రత కలిగి ఉండటం కష్టసాధ్యంగా అనిపిస్తున్నట్లయితే, మీ పనిభారాన్ని తగ్గించుకోండి.

ఆహారాన్ని నియంత్రించండి

ఆల్కహాల్, సిగరెట్లు మరియు అధిక మొత్తంలో కెఫిన్‌ను తీసుకోవడం మానుకోండి.

రక్త హీనతకు చికిత్స పొందండి

రక్తహీనతతో బాధపడుతున్న వ్యక్తికి , రక్తహీనత చికిత్సకు మందులు మరియు పూరకాలను తీసుకోవడం చాలా కీలకం. ఐరన్ సమృద్ధిగా ఉండే పూరకాలను ఎక్కువగా తీసుకుంటే ఎర్ర రక్త కణాలను ఉత్పత్తి చేయడంలో సహాయపడుతుంది, ఇది మీ మెదడు పనితీరును మెరుగుపరచడంలో సహాయపడుతుంది.

క్రమవారీ వ్యాయామం

క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం వల్ల రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, రక్తపోటు సాధారణ స్థితికి వస్తుంది, మీరు చురుకుగా ఉండటమే కాక మీ మెదడు పనితీరు మెరుగవుతుంది. స్థూలకాయం కూడా మెదడు బ్రెయిన్ ఫాగ్‌కు కారణమని భావించబడుతుంది.

విశ్రాంతి సమయాన్ని కొంత ఏర్పాటు చేసుకోండి

సోషలైజింగ్(సమాజికంగా ఉండటం) లేదా పజిల్స్ పరిష్కరించడం మొదలైన ఆటలను ఆడటం వంటి అభిరుచులను కొనసాగించడాన్ని ఆస్వాదించండి, ఇవి ఒత్తిడిని తగ్గించడంలో మరియు ఏకాగ్రతను మెరుగుపరచడానికి ఉపకరిస్తాయి.

ఆరోగ్యకరమైన ఆహారం

మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరచడానికి ఆహార నియమావళిని మెరుగుపరచడం లేదా ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం చాలా అవసరం. తగిన మోతాదులో ప్రొటీన్లు, కేలరీలు, విటమిన్లు వంటివి ఉన్న ఆహారాలు జ్ఞాపకశక్తికి పదును పెట్టడంలో సహాయపడతాయి. క్రమం తప్పకుండా పండ్లు, కూరగాయలు, గుడ్లు, పాలు , కొవ్వులు తినడం వల్ల బ్రెయిన్ ఫాగ్ చికిత్సకు తగినంత పాళ్ళలో ఖనిజాలు లభిస్తాయి. నిర్జలీకరణాన్ని(డీహైడ్రేషన్‌ను) సరిచేయడానికి పుష్కలంగా నీటిని, ద్రవాలను త్రాగండి.

చివరి మాట

బ్రెయిన్ ఫాగ్‌ను తీవ్రంగా పరిగణించడం చాలా ముఖ్యం. బ్రెయిన్ ఫాగ్ కేవలం అలసట యొక్క లక్షణం మాత్రమే కాదు; ఇది మీ పనిని మరియు రోజువారీ జీవనశైలిని తీవ్రంగా మార్చగలదు, ఇది తీవ్రమైన నిరాశ మరియు ఆత్మగౌరవ క్షీణతకు దారితీస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం మరియు ఒత్తిడిని తగ్గించుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన జీవనశైలిని కలిగి ఉండాలని మేము సిఫార్సు చేస్తున్నాము. తగినంతగా పనిచేయడానికి మీ మెదడుకు కూడా విశ్రాంతి అవసరం, కాబట్టి క్రమం తప్పకుండా, మంచి నిద్ర కూడా ఉండాలి.

Avatar
Verified By Apollo Neurologist

The content is medically reviewed and verified by highly qualified Neurologists who bring extensive experience as well as their perspective from years of clinical practice, research and patient care

Quick Appointment
Most Popular

సైనసిటిస్ – రకాలు, కారణాలు, లక్షణాలు మరియు సమస్యలు

బ్లేఫరోప్లాస్టీ సర్జరీ: మీరు తెలుసుకోవలసినది

సహజ విధానంలో నల్లటి వలయాలను వదిలించుకోవడానికి మార్గాలు

ఎముకలు మరియు మృదులాస్థికి ఏ విటమిన్లు మంచివి?

Quick Book

Request A Call Back

X